అంబేద్కర్  ఓవర్సీస్ విద్యా నిధికి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

విశ్వంభర, మహబూబాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం–2026 కింద ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. శ్రీనివాసరావు తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించేందుకు ఎంపికైన ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందజేయనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణకు చెందిన ఎస్సీ విద్యార్థులు అయి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదని తెలిపారు. సంబంధిత విద్యార్హతల్లో ఉత్తీర్ణతతో పాటు టోఫిల్ , ఇఎల్ట్స్ , జి ఆర్ ఈ , జి మాట్     పరీక్షల్లో అర్హత సాధించి, పాస్‌పోర్టు, వీసా అర్హతతో విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు www.telangana.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 31, 2026 అని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ఎస్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కోరారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/applications-are-invited-from-sc-students-for-ambedkar-overseas-education/article-18245

Tags: