రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఢీకొట్టిన బైక్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
విశ్వంభర, శంషాబాద్ : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి ని మోటార్ సైకిల్ ( బుల్లెట్ బండి) ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద తూప్రా గ్రామానికి చెందిన డి శ్రీనివాస్ వయస్సు 49, జూన్ 6వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో అదే గ్రామంలోని బంధువుల ఇంటికి ఫంక్షన్ కు వెళ్లి ఇంటికి వస్తుండగా రోడ్డు దాటుతుండగా గ్రామ కమాన్ వద్దకు వెళ్లగానే అదే సమయంలో తిమ్మాపూర్ నుండి మహేశ్వరం వైపు వెళ్తున్న బైక్ డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి శ్రీనివాస్ ను ఢీ కొట్టడంతో అతను రోడ్డుపై పడటంతో తలకు, కడుపు భాగాన తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం శంషాబాద్ లిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరలా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ డ్యూటీ డాక్టర్లు శ్రీనివాస్ పరీక్షించి జూన్ 7న మధ్యరాత్రి 1:34 గంటల ప్రాంతంలో చనిపోయాడని నిర్ధారించారు. ఈ ఆక్సిడెంట్ కి కారణమైనటువంటి బైక్ డ్రైవర్ భానూరి విజయ్ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.