ఏటీసీ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

విశ్వాంభర,  పెద్ద శంకరంపేట: నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ శివారులో నూతనంగా నిర్మించ తలపెట్టిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ స్థలాన్ని మంగళవారం   నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి స్థలానికి సంబంధించిన వివరాలను, మ్యాప్‌ను పరిశీలించి, పనుల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గ యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి, వారికి ఉన్నతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఈ ఏటీసీ(ATC) భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఏటీసీ భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి  సంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి  ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. మంత్రి  పర్యటనను పురస్కరించుకొని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. నారాయణఖేడ్ ప్రాంత ప్రగతికి, నిరుద్యోగ యువత భవిష్యత్తుకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని, ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, తాహిర్ అలీ, రమేష్ చౌహాన్, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ,స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు  ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-inspected-the-construction-site-of-atc-building/article-18257

Tags: