తుమ్మలపల్లిలో ఘనంగా ఎమ్మార్ఫీఎస్ ఆవిర్భావ దినోత్సవం
విశ్వంభర, మర్పల్లి: తుమ్మలపల్లి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ జెండాను ఆవిష్కరించి, ఎమ్మార్ఫీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్నె రాజు, ఎమ్మార్ఫీఎస్ గ్రామ అధ్యక్షులు డి. బాబు, అధికార ప్రతినిధి పసుల నాగేష్, డి. జయరాజ్, డి. రమేష్, పి. శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధనలో ఎమ్మార్ఫీఎస్ ఉద్యమం చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.