జిల్లా,డివిజన్ అధ్యక్షులకు నియమాక పత్రాలు అందచేసిన వజ్రెష్ యాదవ్
విశ్వంభర, బోడుప్పల్: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా తీర్చి దిద్దాలని మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం బోడుప్పల్ లోని తన నివాసంలో నియోజకవర్గం నుండి నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలలో చోటు దక్కించుకున్న కార్యవర్గ సభ్యులకు, నూతనంగా ఎన్నికైన డివిజన్ అద్యక్షులను శాలువాతో సన్మానించి నియమాక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత విద్యుత్, ఫ్రి బస్సు లాంటి సంక్షేమ పథకాలతో పాటు, సర్కారు బడులను బలోపేతం చేసి అట్టడుగు వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, ఉదయం అల్పాహారం, మద్యాహ్న భోజనం ఏర్పాటు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల వివరాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్లో నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యవర్గ సభ్యులు, నూతన అధ్యక్షులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.