మూసీ పరిరక్షణ ఉద్యమ సహచరుడు కొమ్మిడి నర్సింహారెడ్డికి వేదకుమార్ నివాళి
విశ్వంభర, హైదరాబాదు: భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ ప్రజానాయకుడు కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ ఇంజి. వేదకుమార్ మణికొండ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవకు అంకితమైన నిరాడంబర నాయకుడిగా కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. మూసీ నది పరిరక్షణ ఉద్యమంలో ఆయనతో ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేసిన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక చర్చా కార్యక్రమాలు, అవగాహన సదస్సుల్లో కొమ్మిడి నర్సింహారెడ్డి పాల్గొని మూసీ నది సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యంపై విలువైన సూచనలు చేశారని కొనియాడారు. ఆయన మృతితో ప్రజాజీవితంలో నిబద్ధత కలిగిన నాయకుడిని, మూసీ పరిరక్షణ ఉద్యమానికి అండగా నిలిచిన ఆత్మీయ సహచరుడిని కోల్పోయామని పేర్కొన్నారు. కొమ్మిడి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు వేదకుమార్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.