సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా విద్యాసాగర్
విశ్వంభర, హైదరాబాదు: సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి సమక్షంలో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కే. విద్యాసాగర్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు స్టేట్ నోడల్ అధికారిగా పనిచేసిన దివ్య దేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీ కావడంతో ఆమె నూతన స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్‌కు బాధ్యతలు అప్పగించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. దివ్య దేవరాజన్ అందించిన సేవలను ఆయన అభినందించారు. నూతన స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ ఆధ్వర్యంలో సీఎం ప్రజావాణి కార్యక్రమం మరింత సమర్థవంతంగా కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.