ప్రకృతిని ఆరాధిస్తూ 'శీత్లాభవాని' జాతర
విశ్వంభర, నెల్లికుదురు: గిరిజనులు వర్షాకాలం ఆరంభంలో ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే శీత్లా భవాని పండుగ మంగళవారం నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండాలో అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా ఘనంగా జరుపుకున్నారు. జిపి పరిధిలోని పలుతండాలకు చెందిన గిరిజనులు ఒకే చోట చేరి మేళ తాళాలు,డప్పు చప్పులతో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు నృత్యాలు చేస్తూ పాటలు పాడారు.ఈ సందర్భంగా సర్పంచి గుగులోతు హేమలత శ్రీను నాయక్ మాట్లాడుతూ వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, పశు సంపద పెరగాలని, అంటువ్యాధులు పోకుండా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మేరమ్మ,తుల్జా భవాని,శీత్లా భవాని, మంత్రం,హింగ్లా ద్వాల్,అంగళ్, కంకాలి అనే ఏడుగురు దేవతలను కొలుస్తామన్నారు. తామ తో పాటు తండావాసులు జగజ్జనని లను వర్షాలు కురిసి పాడి పంటలు పండి, ప్రజలు,పశువులు ఆరోగ్యం తోపాటు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు.కాగా మండలంలోని పలు తొండాలలో శీత్లా పండుగను ఆనందోత్సాహార మధ్య ఘనంగా జరుపుకున్నారు.