ఎంఈఓ మన్నె అగ్గిరాములను పరామర్శించిన ఉపాధ్యాయులు
విశ్వంభర, గుండాల: గుండాల మండల విద్యాధికారి (ఎంఈఓ) మన్నె అగ్గిరాములు తండ్రి మన్నె యాదగిరి ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో మంగళవారం మండలానికి చెందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు కొండాపురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడు మన్నె యాదగిరికి ఘనంగా నివాళులర్పించిన ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ టీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్‌తో పాటు గుండాల మండల, జిల్లా పీఆర్‌టీయూ టీఎస్ నాయకులు, సంఘ సభ్యులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు