ప్రైవేట్ అధ్యాపకుల హక్కుల పరిరక్షణకు ఇచ్చిన  హామీలు అమలు చేయాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ప్రైవేట్ అధ్యాపకుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో  హామీలను వెంటనే అమలు చేయాలని,  తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందని టీఎల్ఎఫ్ చైర్మన్ డా. కత్తి వెంకటస్వామి అన్నారు. ప్రైవేట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత, వేతనాలు, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అధ్యాపకుల సేవలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం (టీఎల్ఎఫ్) 19వ ఆవిర్భావ దినోత్సవం, ద్విదశాబ్ది ఉత్సవాల ప్రారంభ సభ మంగళవారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లి  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎల్ఎఫ్ అధ్యక్షుడు ఎం. రామకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీఎల్ఎఫ్ చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సభలో ద్విదశాబ్ది ఉత్సవాల కమిటీని ప్రకటించి, మాజీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సి. భాస్కర్‌రావును కమిటీ చైర్మన్‌గా నియమించారు. ద్విదశాబ్ది ఉత్సవాలు 2027 జూలై 7 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ద్విదశాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ సి. భాస్కర్‌రావు, శ్రీపతి శేఖర్ రెడ్డి,  డా. సురేష్ చంద్ర హరి, ఆనంద్ అధ్యాపకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-guarantees-given-to-protect-the-rights-of-private-teachers/article-18209

Tags: