ఏబీవీపీ పాఠశాలల బంద్ విజయవంతం
విశ్వంభర, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పేట సాయి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపును పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించడం, నాణ్యమైన భోజనం అందించడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయడం, ఎన్‌ఈపీ-2020ను అమలు చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. బంద్‌కు సహకరించిన పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులకు ఏబీవీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వంశీకృష్ణ, శ్రీకాంత్, గణేష్, సుశాంత్, శివ, కార్తీక్, రమేష్, అనూష, సమ్మయ్య, రాజ్‌కుమార్, అజయ్, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.