నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్
విశ్వంభర, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎర్రవల్లి శ్రీనివాస్‌ను సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ కళాకారుల సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సంఘాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడంతో పాటు సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తనవంతుగా కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు దరువు అంజన్న, రాష్ట్ర ఛైర్మన్ అనువోజు వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి దాసు, రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకుడు భుజంగం పరమేశ్ రాజుతో పాటు సంఘంలోని నాయకులు, కళాకారులందరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా తునికి రాజు, పాకాల భూపతి, ప్రధాన కార్యదర్శిగా పరమేశ్, జిల్లా కార్యదర్శిగా పిల్లిట్ల భుజంగం, కోశాధికారిగా కందకట్ల రాజు, సంయుక్త కార్యదర్శులుగా బొల్లం రాజేశ్, ధనరేఖ, ప్రచార కార్యదర్శిగా చిన్నగుండవెల్లి రాజు, గౌరవ అధ్యక్షుడిగా దుబ్బాక శ్యాంసుందర్, గౌరవ సలహాదారులుగా ఇనుప సురేష్, పిల్లిట్ల శశిధర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉదయ్, కనకరాజు, రేణుక, పిన్నింటి బాబు, రమేష్, మల్లేశం, శ్రీనివాస్‌తో పాటు 50మంది కళాకారులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.