ఎమ్మార్పీఎస్ తోనే  సమస్యలు పరిష్కారం

ఎమ్మార్పీఎస్ తోనే  సమస్యలు పరిష్కారం

  • ఎమ్మార్పీఎస్ తోనే  సమస్యలు పరిష్కారం

విశ్వంభర, ఇనుగుర్తి: మందకృష్ణ స్థాపించిన ఎమ్మార్పీఎస్ తోనే ఎన్నో సమస్యల కు పరిష్కారం లభించిందని ఎమ్మార్పీఎస్ ఇనుగుర్తి మండల అధ్యక్షులు చెడుపాకయాకన్న అన్నారు. ఎమ్మార్పీఎస్ 32వ,ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మంగళ వారం మండల కేంద్రం ఇనుగుర్తిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై జెండా ఆవిష్కరించారు.మందకృష్ణ జన్మదిన వేడుకను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా యాకన్న మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ప్రజా ఉద్యమం తోనే వృద్ధులకు,వితంతువులకు,వికలాంగుల తో పాటు పలువురికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన తెల్ల కార్డుదారులకు ఒక్కో వ్యక్తి ఆరు కిలోల చొప్పున బియ్యం వస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం పోరాడినట్లు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు గుజ్జునూరి నరేష్,సీనియర్ నాయకులు బూర రాఘవ రాజు,తమ్మడపల్లి యాదగిరి,గుజ్జునూరి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/problems-are-solved-with-mmps/article-18273

Tags: