సాంస్కృతిక సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలి
భరతనాట్య ప్రదర్శనలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు
– ఏనుగు నర్సింహారెడ్డి
విశ్వంభర, రవీంద్రభారతి: చిన్నారుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కృషి చేస్తున్న కనకదుర్గ నృత్య విభావరి వంటి సాంస్కృతిక సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. భారతీయ శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందిస్తూ చిన్నారులను తీర్చిదిద్దడంలో నృత్య గురువులు, తల్లిదండ్రుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో కనకదుర్గ నృత్య విభావరి 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన భరతనాట్య ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న వయసులోనే ప్రతిభ కనబరిచిన చిన్నారులను అతిథులు అభినందించడంతో పాటు, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, నృత్య గురువులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, డా. మురళీ రవి, లంక లక్ష్మీనారాయణ, డా. కుమార్ భగీరథ, రేఖారాణి, దామోదర్, లయన్ నిర్మల భాస్కర్, మయూరి సుబ్రహ్మణ్యం, రామకృష్ణారెడ్డి, కళాకారులు, తల్లిదండ్రులు, కళాభిమానులు పాల్గొన్నారు.