రసాయన శాస్త్రంలో నమ్రతకు పీహెచ్ డీ
విశ్వంభర, సంగారెడ్డి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఇ. నమ్రత డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘గది ఉస్ణోగ్రత వద్ద విష వాయు సంవేదక అనువర్తనాల కోసం టైటానియం డయాక్సైడ్-డోప్ చేసిన లోహ-కర్బన చట్రాలు ఉత్పన్నాలు, పోర్ఫిరిన్ ఆధారిత సంశ్లేషణ, లక్షణ నిర్ధారణ’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్.సురేంద్ర బాబు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ నమ్రత సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం అభినందనలు తెలియజేశారు.