రోడ్డు ప్రమాదంలో ఎంపీడీవో ఆఫీస్ ఉద్యోగి మృతి
విశ్వంభరు, నెల్లికుదురు: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నవీన్ తొర్రూరు నర్సంపేట ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తొర్రూరు నుంచి తన స్వగ్రామం గుర్తూరు కు బైక్ పై వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. నవీన్ గత కొన్ని సంవత్సరాలుగా నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. కంప్యూటర్ ఉద్యోగిగా మండల ప్రజలకు సుదీర్ఘకాలంగా ఉత్తమ సేవలు అందించేవాడని మంచి పేరుంది. అందరితో ఆప్యాయంగా ఉండేవాడు. నవీన్ ఆకస్మిక మృతితో ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ అకాల మృతితో ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి పిల్లలు భార్య అనాధలయ్యారని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవీన్ పార్థివ దేహాన్ని నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ సందర్శించి నివాళులర్పించారు. ఎంపీడీవో వెంట కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.