ప్రతాపచారికి ఘనంగా నివాళులు
విశ్వంభర, కేసముద్రం : మండలంలోని నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురుసోజు ప్రతాపచారి గత నెల 22న అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో ఆదివారం ఏకాదశ కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేసముద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి పాల్గొని ప్రతాపచారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూరెల్లి సతీష్, గ్రామ సర్పంచ్ ధరావత్ యమునా సుమన్ నాయక్, మార్కెట్ డైరెక్టర్లు గుగులోతు వీరన్న, చిత్రాల వసంతరావు, వార్డు సభ్యులు తాడూరి కవిత ఉమేష్, మాజీ ఎంపీటీసీ దారావత్ రవి నాయక్, గ్రామ మాజీ సర్పంచ్ ఊకంటి సారంగ రెడ్డి, సపావట్ వీరన్న, గుగులోత్ మంగీలాల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



