టిఆర్ఎస్ అభ్యర్థి సునీత ప్రచారం
విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామం 16వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గంగొల్ల సునీత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ఆమె విస్తృతంగా పర్యటించి, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గంగొల్ల సునీత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఇంద్రేశం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో విలీనం కావడం వల్ల నిధుల లభ్యత పెరుగుతుందని, తద్వారా వార్డులో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, సిసి రోడ్ల నిర్మాణం , వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తానని అన్నారు. ప్రచారంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని సునీతకు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు , స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



