ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి 

ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి 

విశ్వంభర, హైదరాబాదు : ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలనే డిమాండ్‌తో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటమని బీజేపీ నేతలు తెలిపారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచివేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతమ్ రావును పోలీసులు అరెస్ట్ చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేస్తోంది. ఆరు గ్యారంటీలు అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కనబెట్టడం దుర్మార్గం. ప్రజల సమస్యలు అడిగితే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల కోసం పోరాడుతున్న మమ్మల్ని అణచివేయలేరు” అని తీవ్రంగా విమర్శించారు. ఇటువంటి చర్యలు ఉద్యమాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు