సమ్మెపై తుది నిర్ణయం నేడే

సమ్మెపై తుది నిర్ణయం నేడే

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: సమ్మె నోటీసుపై అన్ని యూనియన్లు ఐక్యంగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన అధ్యక్షతన అన్ని యూనియన్ల నాయకులు, జేఏసీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. మార్చి 13న ఇచ్చిన సమ్మె నోటీసుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమ్మెను కలసికట్టుగా నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ, ప్రస్తుతం ఉన్న 6 యూనియన్ల జేఏసీ తుది నిర్ణయాన్ని తమ అంతర్గత చర్చల అనంతరం ఈ నెల  24 మంగళవారం సాయంత్రం వరకు వెల్లడిస్తామని జేఏసీ ప్రతినిధులు సుద్దాల సురేష్, కమలాకర్ గౌడ్, రాఘవులు తెలిపారు. జేఏసీలో లేని మిగతా 7 యూనియన్లు కూడా జేఏసీ నిర్ణయం వెలువడిన తరువాత మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఈ సమావేశంలో డివికే రావు, స్వాములయ్య, ప్రేమ్ నాథ్, గోలి రవీందర్, శంకర్, రాజలింగం, రవీందర్ రెడ్డి, కమల్ రెడ్డి, చెన్నారెడ్డి, సాయిలు, అబ్రహం తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags: