యుద్ధంతో ప్రపంచ సంక్షోభం
విశ్వంభర, విజయవాడ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే జరుగుతూ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి దారితీస్తోందని సిపిఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చమురు ఆధిపత్యం కోసం డోనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని, ధరల పెరుగుదలతో రవాణా రంగం దెబ్బతింటోం దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం సరికాదని, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ నెల 29న హైదరాబాదులో “నో వార్” భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. తిరుమల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పదవిలో ఉంచకూడదన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం ప్రభుత్వమే చేయాలని, గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వివాదాలపై విచారం వ్యక్తం చేశారు. సిపిఐ నాయకురాలు అక్కినేని వనజ హామీల అమలు కోరగా, ఈ సమావేశంలో దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.



