ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు 

వచ్చే నెల 6న విచారణ వాయిదా 

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు 

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై స్పందించాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ధిక్కరించారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌తో ఏలేటి పిటిషన్‌ను సుప్రీంకోర్టు జత చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
 

Read More దోమల బెడద .. సామాన్యుల బాధ 

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇటీవల ఇచ్చిన 'క్లీన్ చిట్' నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమని విపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.