కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

విశ్వంభర, బషీర్ బాగ్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ లో తీరని అన్యాయం చేసిందని, తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఇంటలెక్సువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ. చిరంజీవులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యవంతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బడ్జెట్లో ' బీసీలకు తీవ్ర అన్యాయం'పై జరిగిన సదస్సుకు ఎస్.దుర్గయ్య గౌడ్ అధ్యక్షత వహించగా , ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న మాదరిగానే బీసీలకు “బీసీ సబ్ “ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్లో ఇప్పటికైనా  బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని.. వారు అన్ని రకాల పన్నులుచెల్లిస్తున్నప్పటికీ  అభివృద్ధిలో మాత్రం ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని ఆయన విమర్శించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల రాజ్ గౌడ్ , కన్వీనర్లు విజయ్ కుమార్, ఆయిలి వెంకన్న గౌడ్ లు మాట్లాడుతూ బీసీలను ప్రభుత్వానికి చిన్నచూపుగా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత  బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు బడ్జెట్లో చాలా తక్కువగా నిధులు కేటాయించారని మండిపడ్డారు. ఆ కేటాయించిన నిధులు కూడా పూర్తిగా స్థాయిలో ఖర్చు పెట్టకుండా బీసీలకు తీవ్ర అన్యాయం చేశాయని వారు ధ్వజమెత్తారు. ఈ సదస్సు లో బీసీ నేతలు నారాయణ,  శ్రీకాంత్, కైలాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: