మొలుగూరి గోపయ్య కు  సన్మానం

మొలుగూరి గోపయ్య కు  సన్మానం

విశ్వంభర, అనంతగిరి: అనంతగిరి మండలం వాయిలసింగవరం గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయం దగ్గర గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు అధ్యక్షతన సిరి పౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు వ్యవసాయ సామాజిక కార్యకర్త కిసాన్ సేవారత్న, నంది పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ మొలుగూరి గోపయ్య ని ఘనంగా సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్ మొలుగూరి గోపయ్య రైతులకు అందిస్తున్నసేవలను కొనియాడారు వారికిరాష్ట్ర స్థాయిలో నంది పురస్కార అవార్డు రావడ అభినందనీయమని అన్నారు. అనంతరం నంది అవార్డు గ్రహీత డాక్టర్ మొలుగూరి గోపయ్య మాట్లాడుతూ తానుగత నాలుగేండ్లుగా స్వచ్భందంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంపై చేపట్టిన రైతు చైతన్యయాత్రకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం లభించిందన్నారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో రైతులు కొల్లు సుబ్బారావు,దాములూరి మురళి, చిప్పల రాంబాబు, పగిడిఉపేందర్, పగిడి వెంకటేశ్వర్లు, కల్లేపల్లి నరసింహ, జంగిలి వెంకటేశ్వర్లు, మన్నెం కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags: