గ్రామాభివృద్దే లక్ష్యం: సర్పంచ్ నవీన్ 

గ్రామాభివృద్దే లక్ష్యం: సర్పంచ్ నవీన్ 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని  గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలతో  సర్పంచ్ నవీన్  ఆధ్వర్యంలో    రాబోయే   వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని  తాగునీటి సమస్య రాకుండా ఉండాలని, మహేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో మార్కెట్ సముదాయము పక్కన నూతన బోర్ మోటార్కు పంప్ సెట్ బిగించారు. అలాగే గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన   లక్ష్యమని సర్పంచ్ నవీన్ చెప్పారు. గ్రామంలో  ఏ వార్డులో  అయినా తాగునీటి  సమస్య ఉంటే తన  దృష్టికి తీసుకురావాలని అన్నారు.   గ్రామములో వేసవి కాలములో ప్రజలకు  తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గ్రామ సమస్యలను విడతల వారిగా పరిష్కరిస్తామని తెలియజేశారు, అదేవిధముగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99రోజుల ప్రణాళికలో భాగముగా మహేశ్వరం గ్రామ పరిధిలోని మార్కెట్ సముదాయం  ఎంపీడీఓ కార్యాలయము పరిసరాలను శుభ్రపరచడం జరిగింది.ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ జోరల రమేష్,వార్డు సభ్యులు టింగ్లికర్ బేబీ , పొల్కంసునీత,అవులకడి కిష్టమ్మ , స్వర్ణగంటి సంజీవ ,షేక్ అజమ్ , కాడమోని స్వాతి,వత్తుల శాలిని,కాకి పరమేష్,దిద్దెల శ్రీశైలం,ఆకుల వీరబాబు,సున్నం స్వప్న , జటావత్ రుకేష్, రెవెల్లె చంద్రమౌళి,మాజీ ఎంపీటీసీ సభ్యులు పోతర్ల సుదర్శన్ యాదవ్, నాయకులు కర్రోళ్ళ చంద్రయ్య, దత్తు నాయక్ ,కడమోని ప్రభాకర్, మోతె కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సుజాత  పాల్గొన్నారు.

Tags: