పనులు చేపట్టాలని అర్ధనగ్న ప్రదర్శన
విశ్వంభర, తుంగతుర్తి: గోరంట్ల~కొత్తగూడెం రోడ్డు పనులను చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో అర్థ నగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు,మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ప్రతిపాదనలో రోడ్డు మంజూరి కాగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ హడావుడిగా శంకస్థాపన చేశారని గుర్తు చేశారు.అయితే రెండేళ్లు పూర్తయినప్పటికీ పనులు మాత్రం ఇంతవరకు ప్రారంభించకపోవడంతో ఆ రోడ్డు వెంట నడిచే వాహనదారులు,ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని,అలాగే మండలంలోని తుంగతుర్తి~వెంపటి,తూర్పుగూడెం~వెంపటి, బంధారామారం~గుండెపురి రోడ్లన్నీ అద్వానంగా ఉన్నాయని అన్నారు.వెంటనే స్థానిక ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారిస్తూ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు,మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం,సర్పంచ్ మేడదుల రమేష్,ఉపసర్పంచ్ హేష్,సింహాద్రి,కరుణాకర్,కేశవరెడ్డి,సత్యనారాయణ,,సందీప్, నాయకులు పాల్గొన్నారు.



