మాతృభాష తెలుగు కంటి చూపులాంటిది.. ఇంగ్లీష్ భాష కళ్లద్దాలు లాంటిది...

మాతృభాష తెలుగు కంటి చూపులాంటిది.. ఇంగ్లీష్ భాష కళ్లద్దాలు లాంటిది...

  • యువత దేశానికి భవిత, ఐక్యమత్యంతో ఉండాలి
  •  మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు 

విశ్వంభర, రాంనగర్ : ఐక్యమత్యం లేకపోవడం కారణంగా చిన్నచిన్న దేశాలతో పాటు బ్రిటిష్ వారు వచ్చి మనల్ని ఆక్రమించి వందల సంవత్సరాల పాటు బానిసలుగా తయారుచేసి పోయారని, అందుకే యువత దేశానికి భవిత అని దృష్టిలో పెట్టుకొని  ఐక్యమత్యంతో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు.హైదరాబాదు ఆర్.టి సి కళా భవన్ లో సోమవారం  దుర్గ భాయ్ దేశ్ ముఖ్  ఫిజియోథెరపీ కళాశాల ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ  ఉత్సవాలు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ,  యువత సమయాన్ని వృధా చేయకుండా  జీవితంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవితంలో ఎదిగేందుకు  పోటీతత్వం అవసరం ,ఆ పోటీ తత్వంస్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఎదిగిన తర్వాత అందరూ కలిసి ఉండాలన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని సమాజసేవ అందించాలన్నారు. మారుతున్న పరిస్థితులను బట్టి ఎన్ని భాషలునైనా నేర్చుకోవచ్చునని , తల్లి లాంటి మాతృభాష మాత్రం అన్నిటికంటే ముందు ఉండాలన్నారు. మాతృభాష తెలుగు కంటిచూపు లాంటిదని, ఇంగ్లీష్ భాష కంటి అద్దాలు లాంటిది అన్నారు. మాతృభాషలో మాట్లాడటం అలవాటు చేసుకోండి అని సూచించారు. పెరుగుతున్న వయసును దృష్టిలో పెట్టుకొని మానసిక ఉల్లాసం ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ యోగా తప్పనిసరిగా చేయాలని సూచించారు.అదేవిధంగా సగం సమయం చదువుతో పాటు సగం సమయం ప్రజల్లో కలిసి ఉండాలన్నారు.  ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేదిలేదన్నారు క్రమశిక్షణతో అలవాటు చేసుకొని యువత మహోన్నతులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడిఎంఎస్ ప్రెసిడెంట్ ఉషా కంద, డిడిఎంఎస్ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు ఏపీ విశ్రాంతి చీఫ్ సెక్రటరీ ఐ వై ఆర్. కృష్ణారావు , వైస్ ప్రెసిడెంట్ కే లక్ష్మి సుందరి, డి డి సి ఓ పి డాక్టర్ పి.స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Tags: