చేసిన సేవలే గుర్తింపునిస్తాయి

చేసిన సేవలే గుర్తింపునిస్తాయి

  • మెదక్ జిల్లా విద్యాధికారిణి  విద్య

విశ్వంభర,రేగోడు: రేగోడు మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల   బుధవారం ఎల్ఎస్ఐ ఉపాధ్యాయిని మల్లేశం సరస్వతి ఉద్యోగ  విరమణ సమావేశానికి  మెదక్ జిల్లా విద్యాధికారిణి  విద్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుని సరస్వతి 12 సంవత్సరాలుగా కొత్తపల్లి పాఠశాలలో పనిచేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. విధులను  ధర్మం గా నిర్వహిస్తే ప్రజలు చిరస్థాయిగా గుండెల్లో నిలుపుకుంటారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మేడి సతీష్ రావు, పూర్వ జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ, మండల విద్యాధికారులు గురునాథ్, వెంకటేశం, మాజీ మండల్ విద్యాధికారి అశోక్ కుమార్,  పిఆర్టియు టిఎస్ మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు రామచంద్ర చారి, రేగోడు మండల అధ్యక్షులు అంజిబాబు, టేకుమల్ మండల్ అధ్యక్షులు అమిరుద్దీన్, పెద్ద శంకరంపేట అధ్యక్షులు గోపి, ఎస్జీయూ రాష్ట్ర అధ్యక్షులు బోండ్ల శ్రీనివాస్, మండల పరిధిలోని కాంప్లెక్స్ ప్రథమ ఉపాధ్యాయులు, పిజిహెచ్ఎంలు, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Tags: