గంజాయితో తయారు చేస్తున్న బంగ్ 

గంజాయితో తయారు చేస్తున్న బంగ్ 

  • 1.3 కిలోల బంగ్ గోళీలు స్వాధీనం
  • 200 గ్రాముల గంజాయి చాక్లెట్ల సీజ్

విశ్వంభర, హైదరాబాద్:  కొందరు అక్రమార్కులు గంజాయిని రుబ్బి గోళీలుగా  తయారు చేసి వాటికి బంగ్ పేరుతో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించిన ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డితో పాటు సిబ్బంది కలిసి చూడీబజార్, శంకర్ బజారులో ప్రాంతంలో ఉన్న లవకుశ్  ఇంట్లో   తనిఖీలు చేపట్టారు. 1.30 కేజీల బంగ్ గోలీలను, 200 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లవకుశ్ శర్మ భవనం మూడో అంతస్తులో ఉన్న ఇంట్లో తనిఖీలు  నిర్వహించి పట్టుకున్నారు. ఇలా తయారు చేసిన బంగ్ గోలీని  రూ. 100 చోప్పున అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కేసులో లవకుశ్ శర్మతో పాటు భాను ప్రతాప్‌లను ఆరెస్టు చేసి  ధూళిపేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు.

Tags: