మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

విశ్వంభర,నెల్లికుదురు:మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక గౌడ్ హై స్కూల్ లో మండలంలోని వివిధ పాఠశాలలకు బుధవారం నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలలో మోడల్ స్కూల్ ప్రథమ స్థానంలో నిలిచింది. 9వ తరగతి స్టూడెంట్ సింగరం దీక్షిత్ టెస్టులో టాలెంట్ కనపరిచి ఫస్ట్ ప్రైజ్ పొందాడు. ఈ సందర్భంగా ఎంఈఓ రాందాసు మాట్లాడుతూ..మేధాశక్తి పెంపొందించుకోవడంలో సైన్స్ పాత్ర కీలకమైనదన్నారు.మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు మాట్లాడుతూ ఇటీవల నిర్వహియించిన పలు ప్రతిభాపాటవ పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారని చెప్పారు. దీనికి కారణం ఉపాధ్యాయుల సమర్థవంతమైన బోధన, ప్రోత్సాహం విద్యార్థుల పట్టుదల అన్నారు. ఈ సందర్భంగా సైన్స్ టీచర్ను,ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో హెచ్.ఎం.లు వాణి,జలగం శ్రీను,ఉపాధ్యాయులు జీవన్ కుమార్,ఉపాధ్యాయులు రాంనర్సయ్య,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Tags: