కృంగిన రోడ్డు.. తప్పిన ప్రమాదం 

కృంగిన రోడ్డు.. తప్పిన ప్రమాదం 

విశ్వంభర, తిలక్ నగర్ : హైదరాబాదు నల్లకుంట డివిజన్ తిలక్ నగర్ చౌరస్తాలో బుధవారం ఉదయం రద్దీ సమయంలో ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగి గుంత ఏర్పడి, ట్రాఫిక్ అంతరాయం కలిగింది.  ట్రాఫిక్ పోలీసులు వెంటనే రాకపోకలను నిలిపివేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదం తప్పింది. ఇదే ప్రదేశంలో ఆరు నెలల క్రితం కూడా రోడ్డు కుంగిన ఘటన జరిగింది. నాణ్యతలేని పనుల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చేపట్టాలని వారు కోరుతున్నారు.

Tags: