సెమినార్ కు ప్రసన్నకుమార్ ఎంపిక
On
విశ్వంభర, పెద్ద శిఖరం పేట: ఎస్సిఈ ఆర్టీ సెమినార్ కు పెద్ద శంకరంపేట మండలపరిది లోని ఇస్కాపాయల తాండ పాఠశాల ఉపాధ్యాయులు ప్రసన్నకుమార్ ఎంపికయ్యారు. సులభ పద్ధతిలో గణితాన్ని బోధించేందుకు ఉపాధ్యాయుల నుంచి గత ఏడాది సెమినార్ పత్రాలను స్వీకరించి ఉత్తమమైన వాటిని ఎంపిక చేశారు. ఏటా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 29 మంది గణిత ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. మెదక్ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులలో బి.ప్రసన్న కుమార్ ఎంపిక కావడం అభినందనీయం .
హైదరాబాద్ ఎస్సీఈ ఆర్టీలోని గోదావరి హాల్లో గణిత సెమినార్ ను నిర్వహించనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులను పంపాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19న ఎంపికైన ఉపాధ్యాయులు ప్రదర్శన కోసం సిద్ధం అవుతున్నారు.



