ఘనంగా స్వయం పాలన దినోత్సవం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని సంజీవయ్య నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గా సల్ల జానీ, తహసిల్దారుగా సల్ల సుశాంత్, మండలాభివృద్ధి అధికారిణిగా గోర్ల హారిక, ప్రధానోపాధ్యాయురాలిగా నకిరేకంటి లిఖిత, వివిధ హోదాలలో విద్యార్థులు చక్కటి ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఐటిపాముల జలజాక్షి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమములో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీమతి సునీత, అధ్యాపక బృందం నాగయ్య, పుష్పావతి, అబ్దుల్ రహీం, వసంతా దేవి, కుమారస్వామి, సునీత పాల్గొన్నారు.



