20న గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్ననర్ షిప్ సమ్మిట్  

20న గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్ననర్ షిప్ సమ్మిట్  

విశ్వంభర,  మేడ్చల్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం  మల్లా రెడ్డి యూనివర్సిటీలో  మైసమ్మగూడలో బహుళ కంపెనీ  భాగస్వామ్యాలతో ఈ  20న  గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తెలిపారు.  మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన విలేఖరుల సమావేశం లో  మాట్లాడుతూ  ఫిబ్రవరి 20న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు యూనివర్సిటీ ప్రాంగణంలో “గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్”కు సంబంధిచిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ విలేఖరుల సమావేశంలో వైస్ ఛాన్సలర్ డా. వి.ఎస్.కే. రెడ్డి, రిజిస్టర్    డా. కె. శ్రీనివాసరావు, డైరక్టర్ లు డా"భద్రారెడ్డి,డా" ప్రీతీరెడ్డి,,షాలీనీ మహేందర్ రెడ్డి, పోగ్రామ్ కో- ఆర్డినేటర్    డా. నేమాని సుభాష్, ఇంజినీరింగ్ విభాగాల డీన్లు పాల్గొన్నారు...

Tags: