ఆర్ముడు విభాగం నుంచి సివిల్ విభాగానికి బదిలీ

ఆర్ముడు విభాగం నుంచి సివిల్ విభాగానికి బదిలీ

  • శుభాకాంక్షలు తెలిపిన ఎస్పి నరసింహ

 విశ్వంభర,సూర్యాపేట: జిల్లా ఆర్ముడు పోలీస్ విభాగం (ఏఆర్) నందు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నాగేశ్వరరావు, శ్రీధర్, భాస్కర్, వెంకటేశ్వర్లు, సోమయ్య, సుమన్, ఆనందరావు లు సివిల్ విభాగానికి బదిలీ అయ్యారు. బదిలీ అయిన సిబ్బంది జిల్లా ఎస్పీ నర్సింహా ను  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. బదిలీ అయినా సిబ్బందికి మిఠాయిలు పంచి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపేరు.  ఆర్ముడు విభాగం నందు క్రమశిక్షణతో పని చేశారని అభినందించారు. శాంతి భద్రతల విభాగంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడంలో ముందుండాలని అన్నారు. కొత్త బాధ్యతలను సామర్థ్యంతో, నైపుణ్యంతో నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణ కలిగి కొత్త అంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నేరాల చేదనలో నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో  అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డి.ఎస్.పి నరసింహ చారి, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచంద్ర గౌడ్, ఆర్ఎస్ఐ అన్వర్, బదిలీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: