శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం
వైభవోవేతంగా అలంకరణలు, ఘనంగా పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ
విశ్వంభర, ఉప్పల్:ఉప్పల్ జోన్ స్వరూప్ నగర్ లోని శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ కనిగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉప్పల్ కార్పోరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానమని, ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెంకటేశుడిని దర్శించుకోవడం వలన మోక్ష మార్గం లభిస్తుందని ,ఆయనకి ప్రత్యేక పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఆలయంలో వైభవోపేతంగా అలంకరణలు,భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆ శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా బాదంపాలు, మజ్జిగ, ప్రసాదాలు అందచేస్తున్నామని ఆలయ కమిటీ వెల్లడించారు. ఆలయ కమిటీ బోర్డు మెంబర్లు శేఖర్, భాస్కర్, బిక్కుమల్ల రమేష్ గుప్తా, హనుమంతు,తదితరులు పాల్గొన్నారు.



