చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం

చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం

 విశ్వంభర, రామన్నపేట: అనారోగ్యంతో అకాల మరణం పొందిన చిన్ననాటి స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చారు.  యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండల కేంద్రానికి చెందిన  గురుకు శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న  రామన్నపేట ప్రభుత్వ పాఠశాల 2006-07 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమ వంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. రూ.22,000  నగదును  బుధవారం మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు.

Tags: