ఆర్. కృష్ణయ్యను కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ నాయకులు

ఆర్. కృష్ణయ్యను కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ నాయకులు

విశ్వంభర, విద్యానగర్ : హైదరాబాదు విద్యానగర్ బీసీ భవన్‌లో బుధవారం విశాఖ స్టీల్ ప్లాంట్ ఐఎన్టియుసి ఓబీసీ (ఓ బి సి) ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు నీరుకొండ రామచంద్రరావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నీరుకొండ రామచంద్రరావుతో పాటు నెల్లి అప్పలరాజు, తెప్పల సాంబశివరావు, సీలం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

Tags: