మిర్యాలగూడ మునిసిపల్ ఛైర్ పర్సన్కు సన్మానం
విశ్వంభర, మిర్యాలగూడ: నూతన మునిసిపల్ ఛైర్పర్సన్ ,పట్టణ మొదటి పౌరురాలు సుధ బాలకృష్ణ ను పట్టణ పద్మశాలి సంఘం తరుపున ఘనంగా సన్మానం చేశారు. పద్మశాలి సంఘం స్టీరింగ్ కమిటీ,పట్టణ కమిటీ గజమాలతో చైర్ పర్సన్ దంపతులను సత్కరిచారు. 14వ వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. పట్టణ చరిత్రలో పద్మశాలి ఆడపడుచు చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలి కులస్తురాలుకు చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి పద్మశాలీలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ సుధ బాలకృష్ణ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని, స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్ది,పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చుతానని తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు జెల్లా రాంబాబు, బావండ్ల పాండు, డాక్టర్ గుండు అంజయ్య, డాక్టర్ మిర్యాల కృష్ణయ్య,డాక్టర్ మనోహర్, అక్షిత క్యామా వెంకటేశం, యర్రమాద దుర్గమ్మ, రాపోలు వెంకటేశ్వర్లు, బొల్లా లక్ష్మీనారాయణ, రావిరాల నాగేందర్, కోడి జనార్దన్,మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవిశ్యామ్, జెల్లా శ్రీనివాస్, జిల్లా ప్రభాకర్, మురళి, శ్రీను పట్టణ కమిటీ సభ్యులు స్టీరింగ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు..



