మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ కు అభినందనలు
On
విశ్వంభర, కేసముద్రం: ఇటీవల ఎన్నికయిన కేసముద్రం మున్సిపాలిటీ నూతన మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు ను బానోతు బిక్షపతి, కందుకూరి రవీంద్ర చారి, ఎండి సలీం, అడప మురళి, బెతు కృష్ణమూర్తి ,కుమార్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు దేవ్ సింగ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కేసముద్రం మున్సిపాలిటీ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ చొరవ తో ఇంకా మరిన్నీ నిధులు కేసముద్రం కు కేటాయించేలా చూడాలని వైస్ చైర్ పర్సన్ ని కోరారు. తమ ప్రాంతంలో గల వివిధ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు .



