రైతులందరు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి 

రైతులందరు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి 

  •  జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్ 

 విశ్వంభర,సూర్యాపేట: బుధవారం జరిగిన వీడియో (వెబ్ఎక్స్ )కాన్ఫరెన్స్లో  సూర్యాపేట జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, మండల పరిషత్, సహకార సంఘం జిల్లా, మండల ,గ్రామ అధికారులు అందరూ హాజరయ్యారు.  తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ   గురించి తెలుపుతూ, అందరూ అధికారులు త్వరితగతిన సూర్యాపేట జిల్లాలోని ప్రతి కుటుంబంలోని భూమి పట్టాపాస్ బుక్  కలిగి ఉన్న ప్రతి రైతు  ఫార్మర్ రిజిస్ట్రీ ( ఫార్మర్ ఐడి ) నమోదు చేసుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  మీదగ్గర లోని  మీ-సేవ కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణాధికారి (AEO)  వద్ద నమోదు చేసుకోవచ్చు.  రైతు రిజిస్ట్రీ నమోదు 100 శతం పూర్తి చేయుటకు గురువారం నుండి ఈ నెల 23 వరకు మండలంలోని  ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒకరోజు వ్యవసాయ శాఖ, ఇతర శాఖ అధికారులు అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో రైతు రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను చేస్తారు. గ్రామంలో అందుబాటులో లేని రైతులు, వారు నివాసం ఉంటున్న  ఇతర ప్రాంతాల్లోని ఏదైనా మీ_ సేవకు వెళ్లి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ను నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్తులో రాష్ట్ర, కేంద్ర పథకాలు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి మీదనే ఆధారపడి ఇవ్వడం జరుగుతుంది. పంట రుణాలు, పత్తి కొనుగోలు, వరిపంట కొనుగోలు, వ్యవసాయ శాఖ ఆధారిత పథకాలు అన్ని కూడా ఈ రైతు రిజిస్ట్రీ ఐడి ఆధారంగానే అమలు చేస్తారు.  ఈ కాన్ఫరెన్స్లో  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: