ఘనంగా వీడ్కోలు సమావేశం
- అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
విశ్వంభర,నెల్లికుదురు:మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ విద్యార్థులకు ఆ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థులతోపాటు అధ్యాపక బృందం బుధవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించింది.ఈ సందర్భంగా విద్యార్థులు రెండు సంవత్సరాలుగా తమ సీనియర్,జూనియర్ స్టూడెంట్స్ తో అధ్యాపకులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మధుర జ్ఞాపకాలను,తీపి గుర్తులను చెప్పుకుంటూనే ఇక ఎక్కడెక్కడ చదువుతామో,ఏం చేస్తామో,ఎక్కడ స్థిరపడిపోతామో అంటూ ఒక్కొక్కరుగా భవిష్యత్తును ఆవేదనాభరితంగా వివరించారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో జూనియర్ కాలేజ్ దశ ఎంతో కీలకమని, ఇక్కడ పొందిన విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు వారి భవిష్యత్‌ను దిశానిర్దేశం చేస్తాయన్నా రు. అధ్యాపకులు విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటూ విలువైన సూచనలు అందించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక,నృత్య ప్రదర్శనలు అలరిస్తూ ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, ప్రకాష్ బాబు, కవిరాజ్, రఘురాం, నాగేశ్వరరావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సుధాకర్, మహేందర్, రామ్మూర్తి, బాబు, అనిల్ కుమార్, సతీష్, యాకన్న,అధ్యాపకేతర సిబ్బంది ప్రదీప్, గౌరీశంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



