మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి 

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి 

  • మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ 

విశ్వంబర, మహబూబాబాద్:  జిల్లా కేంద్రంలోని అనంతరం మోడల్ స్కూల్ , నలంద డిగ్రీ కళాశాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలకు  దూరంగా ఉండాలని  అన్నారు.  గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై  విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు . విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు . చెడు వ్యసనాలకు అలవాట్లకు లోను కావద్దని అన్నారు. మంచిగా చదువుకొని  అనుకున్న లక్ష్యాలను సాధించి, ఉన్నత స్థానంలో స్థిరపడాలని  విద్యార్థులను కోరారు .  ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎక్సైజ్ SI మౌనిక, కానిస్టేబుళ్లు  వెంకట నరసయ్య, యాదగిరి, రాజు & శ్రీనివాస్,  మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు , నలంద డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్  డోలి సత్యనారాయణ , విద్యార్థులు  పాల్గొన్నారు

Tags: