ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం : కెఎల్ఆర్  

ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం : కెఎల్ఆర్  

విశ్వంభర, మహేశ్వరం :   నిత్యం రద్దీగా ఉండే రావిర్యాల. సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దేవాలయం రోడ్డుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహర్ధశ వచ్చింది. పెద్ద చెరువు పక్కన ఉండే రోడ్డు పనులు, విస్తరణ, మరమ్మతులకు రూ. 4 కోట్లు  వచ్చేలా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కృషి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  దృష్టికి సమస్యను తీసుకెళ్లి రావిర్యాల  సర్దార్ నగర్ రోడ్డు విస్తరణకు అనుమతులు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో సార్లు మొర ట్టుకున్నామని రావిర్యాల  సర్దార్ నగర్ ప్రజలు తెలిపారు. కనీసం స్పందించలేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రావిర్యాల పెద్ద చెరువు తూము, రోడ్ల విస్తరణ కెఎల్ఆర్  సహకారంతో చేసుకుంటున్నామని తుక్కుగూడ జిహెచ్ఎంసి  డివిజన్ నాయకులు చెప్పారు.

Tags: