సర్వేకు ప్రజలు సహకరించాలి
- మున్సిపల్ కమిషనర్
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ మున్సిపాలిటీలో నిర్వహించనున్న వివరణాత్మక పట్టణ సర్వేకు పట్టణ ప్రజలు ఈ సర్వేకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నక్ష అనేది భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపడుతున్న ఒక ఫ్లాగ్‌షిప్ పథకమని, ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని భూములు , ఆస్తులపై భౌగోళిక సమాచార ఆధారిత కడాస్ట్రల్ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూముల తరహాలోనే పట్టణ భూములకు కూడా హక్కుల ) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా 10 మున్సిపాలిటీల్లో అమలు చేయడానికి ఎంపిక చేశారని చెప్పారు. వాటిలో మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా ఒకటని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఆస్తులపై వివరణాత్మక పట్టణ సర్వే నిర్వహించి కడాస్ట్రల్ రీ–సర్వే చేపడతారు. ఈ సర్వే లో మండల సర్వేయర్లు , రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొంటారని చెప్పారు.



