భాదిత చేనేత కార్మిక కుటుంబానికి ఆర్ధిక సాయం. - అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుటుంబానికి పరామర్శ 

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 

భాదిత చేనేత కార్మిక కుటుంబానికి ఆర్ధిక సాయం. - అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుటుంబానికి పరామర్శ 

విశ్వంభర, పుట్టపాక : పుట్టపాక కేంద్రంలో ఇటీవల అప్పుల బాధతో చేనేత కార్మికుడు పానుగంటి క్రాంతి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం మాజీ సర్పంచ్ సామల భాస్కర్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న ఎంతో మంది కుటుంబాలు ఆర్ధిక పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురి అవుతూ , మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడడం చాల బాధాకరమైన విషయం  అని ఆమె అన్నారు. క్రాంతి మరణం చాల బాధాకరం అని,  భార్య , 2 సం. రాల కొడుకు కు, ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.  ఈ కార్యక్రమంలో చిన్న కోట్ల సప్నా రాజ్. నోముల రేఖ, మడూర్ శశికళ, ఆడెపు శాంతి, గుర్రం శ్రవణ్ కుమార్, ఏలే మహేష్ నేత తదితరులు పాల్గొన్నారు.

Tags: