ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు 

ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు 

విశ్వంభర, మహబూబాబాద్ :  ఎస్సి కార్పొరేషన్ లోన్  ద్వారా స్వయం ఉపాధి  పథకాల కోసం ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా అధికారి  శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్ లైన్ దరఖాస్తు గడువు ను ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. కావున అర్హులైన వారు  షెడ్యూల్డ్ కులములకు చెందిన యువతీ ,  యువకులు , సంబందిత కుల, ఆదాయ, నివాస దృవీకరణ పత్రాలు, ఆదార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ సైజు పోటో, పట్టాదారు పాసు పుస్తకం (వ్యవసాయ రంగం యూనిట్లకు),  శాశ్వత (డైవింగ్ లైసెన్సు ) తదితర దృవ పత్రాలతో ఆన్ లైన్ లో నమోదు చేసుకోగలరని చెప్పారు. వివరాల కోసం (www.tgobmms.cgg.gov.in), వెబ్ సైట్ ని సందర్శించగలరని  తెలిపారు.ఈ అవకాశాన్ని అర్హులైన ఎస్సి నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోగలరని  కోరారు .

Tags: