సిసి రోడ్డు పనుల పరిశీలన
On
విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట డివిజన్ పటేల్ నగర్, నరేంద్ర నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు మంచినీటి, డ్రైనేజీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సిసి రోడ్డు పనులు పూర్తయ్యే లోపే అన్ని ప్రాథమిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, రమేష్, వాటర్ లైన్ మాన్ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ అంబర్‌పేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, లక్ష్మణ్, శివ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.



