పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక 

పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక 

  •  గంగుల వెంకట్ రాజిరెడ్డి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి తెలిపారు. గురువారం రామన్నపేట మండల పరిధిలోని పల్లివాడ గ్రామంలో నాంపల్లి విజయలక్ష్మి-కృష్ణ దంపతులకు చెందిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయని తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు జరుగుతుండగా, మరి కొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మేకల మల్లేష్, నాగులంచ నరేష్, వార్డు సభ్యులు సిరిశాల సోమలక్ష్మమ్మ, మల్లేష్, నాంపల్లి రాజు, మేకల మహేష్, దూదిమెట్ల అశోక్, మేడి మల్లయ్య, సింగపాక నరసింహ, నాంపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Tags: