గిరిజన తండాలలో ముమ్మరంగా ఫాగింగ్
On
విశ్వంభర, ఇనుగుర్తి: విజృంభిస్తున్న దోమలను అరికట్టడం కోసం గిరిజన తండాలలో ముమ్మరంగా ఫాగింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారుతండాలైన జామ్ల తండా,పడమటి తండ, కోక్యతండాలలో గురువారం ఆ గ్రామ ఉపసర్పంచ్ ఇస్లావత్ బాబు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది దోమల మందు పిచికారి యంత్రంతో తండాలలోని సైడు కాలువలు,మురుగునీటి గుంతలు,వీధులలో ఫాగింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ బాబు మాట్లాడుతూ గిరిజన తండాలలోని ప్రజలు, పశువులు గొర్రెలు మేకలు, దోమలతో అవస్థలకు గురవుతున్న విషయం సర్పంచి బిక్షపతి గౌడ్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే స్పందించి ఫాగింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్, వార్డు సభ్యులు తండావాసులు పాల్గొన్నారు.



